కలలో ఇవి కనిపిస్తే వివాహం తప్పనిసరి! ఇంటికి మామిడితోరణాలు కట్టినట్టుగా...

సోమవారం, 23 మార్చి 2015 (19:33 IST)
శుభాలకి సంబంధించిన కలలు మంచి ఫలితాలనే ఇస్తాయని పండితులు అంటున్నారు. వీటిలో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన కలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యువతులకి వచ్చే కొన్ని శుభాలతో కూడిన కలలు త్వరలో వారి వివాహం జరగనుందనే విషయాన్ని సూచిస్తూ ఉంటాయి.
 
మంగళ వాయిద్యాలు ఎదురైనట్టుగా, తమ ఇంటికి మామిడితోరణాలు కట్టినట్టుగా కల వస్తే ఆ ఇంటి పెళ్ళి భాజాలు మోగడం తప్పనిసరి అని పంచాంగ నిపుణులు అంటున్నారు.

తన కుటుంబ సభ్యులకు దూరంగా వెళుతున్నట్టుగా, తాను మరొకరి ఇంటిలో దీపం వెలిగిస్తున్నట్టుగా, బంగారు ఆభరణాలు ధరించినట్టుగా, చేతి నిండుగా గాజులు వేసుకుంటున్నట్టుగా, ఆలయంలో అమ్మవారిని దర్శించి ఆమె ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా యువతులకు కలలో కనిపిస్తే త్వరలోనే వారి వివాహమవుతుంది.

వెబ్దునియా పై చదవండి