వినాయక చవితి.. స్వస్తిక్ గుర్తును మరిచిపోకండి..

సెల్వి

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (22:11 IST)
స్వస్తిక్ భగవానుడు శ్రీ గణేశుని చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన స్వస్తిక చిహ్నాన్ని గణేశుడి కుటుంబానికి ప్రతీకగా భావిస్తారు. స్వస్తిక్‌కు ఉండే నాలుగు గీతలు గణేశుడి నాలుగు చేతులకు ప్రతీకగా నమ్ముతారు. 
 
స్వస్తిక్ నాలుగు గీతలు నాలుగు ధర్మాలకు ప్రతీక. ధర్మము, అర్థము, కామము, మోక్షములైతే.. స్వస్తిక్‌లోని రెండు రేఖలు గణేశుని ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్దిలను సూచిస్తాయి. 
 
మరో రెండు పంక్తులు గణపతి ఇద్దరు కుమారులు యోగ, క్షేమలను సూచిస్తాయి. ఈ గుర్తు శుభాన్ని సూచించడమే కాకుండా ఇంటికి సానుకూల శక్తిని కూడా తెస్తుందని నమ్మకం. 
 
అందుకే గణేశుడిని వినాయక చతుర్థి రోజున పూజించేందుకు ముందు స్వస్తిక్ గుర్తు వేయడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు