శ్రావణ శుక్రవారం: గుమ్మానికి పసుపు-కుంకుమ.. ఇరువైపులా దీపాలు పెడితే..? (video)

గురువారం, 20 జులై 2023 (22:14 IST)
శ్రావణ మాసం, శుక్రవారం గుమ్మానికి బయటి వైపు దీపాలు పెడితే శుభ ఫలితాలు వుంటాయి. గుమ్మానికి బయటి వైపు పక్కనే దీపాలు పెట్టాలి. ప్రతిరోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కన ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం వెల్లివిరుస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.  
 
గుమ్మంకు ఇరువైపులా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం, ఐదు రూపాయి బిళ్లలు అందులో వేయాలి. అలాగే ఒక ఎరుపు రంగు పుష్పం. వీలైతే ఒక వట్టి వేళ్లు గుత్తి అందులో వుంచాలి. ఈ రెండు చెంబుల్ని గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే వుంచాలి. 
 
ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ.. అలాగే పచ్చ కర్పూరం, వట్టి వేళ్లు, ఎరుపు రంగు పుష్పం వేసి మశ్సీ చెంబుతో నీళ్లు పెడుతూ వుండాలి. ఇలా చేస్తే ఆ ఇంట లక్ష్మీ దేవి అడుగుపెడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు