సాముద్రికా లక్షణం అంటే..?
కాలు, పాదాలు.. ఓ మహిళ పాదాలు తామరపూవులాంటి రంగును కలిగివుండాలి. కాలి ఐదు వ్రేళ్లు భూమిపై ఆనేట్లు వుండాలి. ఐదువేళ్లు భూమాతను తాకిట్లే వుంటే ఆ మహిళ ఇంట సకలసంపదలు చేకూరుతాయి. కాలి బొటనవేలు ఎత్తుగా దాని తర్వాత వేలు కాస్త తక్కువగా వుంటే సంపదలకు ఢోకా వుండదు. కొందరు మహిళలకు కాలి చిటికెన వేలు మాత్రం భూమిని తాకదు. ఆ మహిళకు కష్టాలు, ఈతిబాధలు వుంటాయి.
మహిళల గొంతుభాగం అరటి దూట వలె వుండాలి. మహిళల తొడలు మెరిసేలా వుండాలి. చేతులు, చేతివేళ్లు ఎప్పుడు అందంగా కనిపించేలా వుండాలి. అలాగే కేశాల్లో పుష్పాలను అలంకరించుకోవాలి. శిరోజాల్లో పుష్పాల ధరించడం ద్వారా సువాసన వెదజల్లేలా వుండాలి. జుట్టు మృదువుగా వుంటే జీవితం కూడా అదే విధంగా వుంటుంది. సాముద్రికా లక్షణంలో నుదుటి భాగం ఎప్పుడు ఇతరులను ఆకట్టుకునేలా వుండాలి. నుదుటిపై బొట్టు పచ్చగా వుండాలి.