కాల సర్పదోషానికి కాలభైరవుడిని పూజించండి..

శుక్రవారం, 30 జూన్ 2017 (13:26 IST)
కాల సర్పదోషానికి శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్ళలేని వారు.. కాల భైరవుడిని పూజిస్తే సరిపోతుంది. శునకాన్ని పెంచితేనే సరిపోతుంది. కాల భైరవునికి ఇది వాహనం కావడంతో శునక పోషణ ద్వారా కాల సర్పదోష దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే సుప్రసిద్ధ కాలభైరవుని ఆలయం తమిళనాడులోని శివగంగై జిల్లా, తిరుప్పత్తూరులో వుంది. 
 
అక్కడే శివాలయం కూడా వుంది. అక్కడ భైరవుడు శునక వాహనంపై కాకుండా ఇతర దేవతల వలె ఆసీనుడై దర్శనమిస్తాడు. కాలసర్పదోషాన్ని నివృత్తి చేసుకోవాలంటే.. కులదేవతా పూజ తప్పకుండా చేయాలి. మానసిక బాధితులకు సహాయం చేయాలి. 
 
అనాధలకు చేతనైనా సాయం చేయాలి. ఇలా కనుక చేస్తే కాల సర్పదోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఇంకా రాహు-కేతు పూజలతో ఈ కాలసర్పదోషం శాంతించదు. మానసాదేవిని పూజించడం ద్వారానే కాలసర్పదోషానికి నివృత్తి అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి