కృష్ణపక్ష పంచమి.. కొబ్బరి పువ్వును వారాహికి సమర్పిస్తే?

సోమవారం, 4 సెప్టెంబరు 2023 (17:06 IST)
సెప్టెంబర్ 4, 2023 కృష్ణపక్ష పంచమి. ఈ రోజు వారాహీదేవి పూజకు ఉత్తమం. ఈ రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారాహి పూజ చేయడం విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వారాహీ పూజ చేయడం శుభఫలితాలను ఇస్తుంది. రాత్రి పూట అమ్మవారికి నేతితో పంచముఖ ప్రమిదలో దీపం వెలిగించాలి. ధూపం ఇవ్వాలి. 
 
ముఖ్యంగా నేలకింద పండే దుంపలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే కృష్ణపక్ష పంచమి రోజున కొబ్బరి పువ్వును అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలుండవు. ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
coconut flower
 
కొబ్బరి పువ్వు, దానిమ్మ గింజలు, తాంబూలం, అరటిపండ్లు, మందార పువ్వులను వారాహీ దేవికి సమర్పించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు