నవగ్రహాలలో బృహస్పతి సొంత రాశిలో బుధుడు ప్రవేశించడం కారణంగా మీనరాశిలోకి అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. అందులో వృషభం, మిథునం, కన్యారాశి, మకరం వున్నాయి. ఈ యోగం ద్వారా వృషభ రాశికి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుటుంబ సౌఖ్యం వుంది.