కుజ గ్రహదోషాలున్న జాతకులు ఆలయాలకు వెళ్తే సరిపోతుందా? లేకుంటే దోషం కలిగిన గ్రహానికి కూడా పూజ చేయాలా? అనే దానికి సమాధానం కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. గ్రహాలు-పరిహారాలు అంటేనే జాతకులు ఆలయాలకు మాత్రమే వెళ్ళాలనుకుంటున్నారు. అయితే గ్రహదోషాలున్న జాతకులు ఆలయాలకు మాత్రమే పోకుండా.. ఉదాహరణకు.. కుజదోషం ఉన్న జాతకులు రక్తదానం చేయడం వంటివి చేస్తే.. దోష నివారణ అవుతుంది.
ఇంకా కుజుడు భూమి కారకుడు కావడంతో ఆలయ ఆస్తులను ఉంచుకున్న వారు వాటిని తిరిగి ఇచ్చేయడం చేయాలి. ఇతరుల స్థలాన్ని ఆక్రమించుకున్నట్లైతే వారికి ఆ ఆస్తులు చేరేలా చేయడం మంచిది. ఇంకా కుజుడు సోదరతత్త్వానికి ప్రతీక. అందుచేత సోదరులకు, సోదరమణీలకు సాయం చేస్తే కుజ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. సహోదరులకు, సోదరీమణులకు ఆర్థిక సాయం లేదా ఇతరత్రా సహాయాలు చేయడం.. వారితో స్నేహభావంతో మెలగడం ద్వారా కుజుడిని శాంతి పరచవచ్చునని.. తద్వారా కుజదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అలాగే కుజదోష జాతకులు మంగళవారాల్లో హనుమంతుడిని పూజించడం చేయాలి. హనుమాన్ జయంతి, వినాయక చతుర్థి నాడు ఆలయానికి వెళ్ళి పూజించడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఎరుపు రంగు దుస్తులను లేదా ఎరుపు రంగు చేతి రుమాలును చేతిలో ఉంచుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.