శ్రీ మహాలక్ష్మీకటాక్షం కోసం శుక్రవారంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శుక్రవారం పూట గోరింటాకు పెట్టుకుంటే శుభసూచకమని వారు చెప్తున్నారు. గోరింటాకు పూయించి ఎరుపు రంగు సూర్యునికి పత్రీకగా చెప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఝాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు.
ఇక భర్తకు గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నచేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ అని అంటుటారు.
అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. గోరింటాకు పొడిని నూనెలో కలిపి వడకట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది.