మార్గశిర మూలా నక్షత్రం ఏం చేయాలి..

సెల్వి

మంగళవారం, 9 జనవరి 2024 (18:57 IST)
నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం. మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశి అధిపతి గురువు, జంతువు శునకం, పురుష జాతి. ఈ నక్షత్ర జాతకులు శక్తిమంతులై ఉంటారు. అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయి. దైవజ్ఞానము గలవారై ఉంటారు. పట్టుదలతో, స్వయంకృషితో జీవితంలో ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి వైపు సాగిపోతారు. 
 
అభివృద్ధి, ఆధిపత్యమే ఈ జాతకుల లక్ష్యం. ఈ జాతకులు అన్నీ రంగాల్లో రాణించినప్పటికీ కొన్ని ఈతిబాధలు.. రాహుకేతు గోచారం వల్ల ఏర్పడే కష్టాల నుంచి తొలగించుకోవాలంటే.. మాసంలో వచ్చే మూలా నక్షత్రం రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. జనవరి పదో తేదీన మూలా నక్షత్రం వస్తోంది. 
ఈ రోజున సమీపంలోని హనుమంతుని ఆలయాన్ని సందర్శించే మూలా నక్షత్ర జాతకులను సర్వాభీష్ఠాలు చేకూరుతాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు