రాహుకాలంలో నోటికి తాళం వేస్తే..?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:03 IST)
రాహుకాలం పరీక్షా కాలమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఆ సమయంలో నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆ విధంగా రాహుకాలంలో మౌనవ్రతాన్ని ఆచరించడం మంచిదని, తద్వారా పాపాలు హరించుకుపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
రాహుకాలం ఒకటిన్నర గంటల సమయం. ఈ గంటన్నరలో ఎవరూ మంచి పనులు చేయరని అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో రాహు కాలంలో మౌనం పాటించడం మంచిది. 
 
ముఖ్యంగా స్త్రీలకు రాహుకాలంలో మౌనవ్రతం చేయడం చాలా ప్రయోజనకరమని, రాహుకాలంలో మంగళ, శుక్రవారాల్లో మౌనవ్రతం చేయవచ్చని చెప్తున్నారు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు సెలవిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు