నరసింహ జయంతి.. సాయంత్రం పూట ఇలా చేస్తే..?

గురువారం, 4 మే 2023 (11:48 IST)
చతుర్థశి అయిన ఈ రోజు లక్ష్మీ నరసింహ జయంతి. ఈ రోజున శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలను పొందవచ్చు. ఈరోజు ఉపవాసంతో నరసింహుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి. నరసింహం అంటే కాంతి జ్వాల. నరసింహుడు అతి పెద్ద జ్వాల అని పురాణం చెబుతోంది. నరసింహ పూజకు సాయంత్రం 4.30 నుండి 7.30 గంటలు ఉత్తమ సమయం.
 
నరసింహ స్వామి శక్తివంతుడు. ఉగ్ర స్వరూపుడు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదునిని రక్షించడం కోసం ఈ అవతారం ఎత్తాడు. ప్రతిరోజూ ఆయనను భక్తి శ్రద్ధలతో కొలిస్తే.. శత్రువులను ఓడించే శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగించి.. కోరుకున్నది ప్రసాదిస్తాడు. ఇంకా బుధవారం నాడు ఆయనను పూజిస్తే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వాసం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు