ఈ రోజున ఉదయం పూట శుచిగా స్నానమాచరించి.. ఇంటిని శుభ్రం చేసుకుని.. ఇంటి ముఖ ద్వారం ముందు పసుపుతో లేదా కుంకుమతో స్వస్తిక్ వేయాలి. పేదలకు దానంగా ఆహారం, దుస్తులు ఇవ్వాలి. వైశాఖ పౌర్ణమి రోజున సముద్ర స్నానం తప్పక ఆచరించాలి.
ఈ రోజున కరక్కాయను తీసుకెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానమాచరించడం ద్వారా వల్ల నరఘోష, నరదిష్టి తొలగిపోతుందని విశ్వాసం. జ్ఞాన పూర్ణిమ, బుద్ధ పౌర్ణమి, శ్రీ కూర్మ జయంతి, అన్నమయ్య జయంతి అన్నీ విశేషాలు ఈ రోజున జరుపుకుంటారు.
గౌరీదేవిని పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున ఆకలతో వున్న వారికి అన్నదానం చేయడం, పేదవారికి వస్త్రదానం, గొడుగు, చెప్పులు, నీటికుండ వంటివి దానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో తులసి కోటను శుభ్రం చేసుకుని పూజించడం వల్ల గొప్ప పుణ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.