నవరాత్రులలో మొదటి మూడు రోజులు లక్ష్మీదేవికి, తరువాతి మూడు రోజులు శక్తికి, చివరి మూడు రోజులు సరస్వతికి అంకితం చేస్తారు. అలాంటి నవరాత్రి పూజను శ్రీరాముడు కూడా చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. దేవీ భాగవతంలో, రాముడు ఆచరించిన నవరాత్రి వ్రతం గురించి వ్యాస మహర్షి వివరించారు.
"రామచంద్రా! రావణుని సంహరించే మార్గం చెబుతాను. నవరాత్రులలో ఉపవాసం ఉండి, అమ్మవారిని పూజిస్తే.. మీకు అపరిమితమైన వరాలను ప్రసాదిస్తుంది.. ఇంద్రుడు, విశ్వామిత్రుడు వంటి వారు నవరాత్రి వ్రతాన్ని ఆచరించి ప్రయోజనం పొందారు. కాబట్టి నవరాత్రి వ్రతమాచరించండి అని చెప్పి ఉపవాస పద్ధతుల గురించి చెప్పారు.