చెడు స్వప్నాలు వస్తే ఏం చేయాలో తెలుసా? (video)

శనివారం, 20 జులై 2019 (16:46 IST)
కొందరికి చెడు స్వప్నాలు వస్తుంటాయి. నిద్రలో చెడు స్వప్నాలకు భయపడే వారు చాలామంది వుంటారు. చెడు స్వప్నాలను రాకుండా వుండాలంటే.. ఎలాంటి పరిహారాలు చేయాలనే అంశాలపై ఆధ్యాత్మిక నిపుణులు ఇచ్చిన సలహాల గురించి తెలుసుకుందాం.. 
 
కలలో పాములు ఇతర విష సంబంధిత జంతువులు భయపెడితే.. గరుడునిపై కూర్చున్న శ్రీ మహావిష్ణువు పటాన్ని పూజించడం చేయాలి. లేకుంటే ఆలయంలో వున్న గరుడాళ్వారునికి నెయ్యి దీపం వెలిగించి స్తుతిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇంకా విష సర్పాలు, ఇతరత్రా విష జంతువులు కలల్లోకి రావు.
 
వ్యాధులు, రోగాలకు సంబంధించిన కలలు వస్తే.. ధన్వంతరి భగవానుడి మంత్రాన్ని పఠిస్తే.. ధన్వంతరికి పూజ చేయిస్తే సరిపోతుంది. ఇంకా ఆంజనేయ స్వామిని కూడా స్తుతిస్తే అలాంటి కలలు రావు. ఇంకా ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
దెయ్యాలు, భూతాలు కార్యవిఘ్నాలు చేసినట్లు కలగంటే.. రావి చెట్టు కింద వున్న వినాయకుడిని పూజించాలి. ఆయనకు అర్చన చేయించాలి. అటుకులు సమర్పించుకోవాలి. 
 
అలాగే ఆర్థిక ఇబ్బందులు, ధననష్టం వంటి కలలు వస్తే.. శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించాలి. ఇంకా సాయంత్రం పూట నేతితో దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేస్తే అలాంటి కలలు రావటాన్ని నియంత్రించవచ్చు. 
 
విద్యాభ్యాసానికి అడ్డు కలిగేలా కలలు వస్తే.. సరస్వతీ దేవి, హయగ్రీవ మంత్రాలను పఠించడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే పితృదేవతలు అంటే మరణించిన ఇంటి పెద్దలు కలలోకి వస్తే.. శ్రీ మహా విష్ణువుకు ఏకాదశి వ్రతమాచరించి.. ప్రదక్షణలు పూర్తి చేయాలి. ఇంటిదేవతా పూజ చేయాలి. పితృదేవతలకు అమావాస్య రోజున తర్పణాలు ఇవ్వడం.. వారిని తలచి దుస్తులు, ఆహారం సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
సాధారణంగా చెడు కలలు వస్తే.. ఉదయం నిద్రలేచి స్నానమాచరించి.. పెరుమాళ్ల వారిని.. లేకుంటే ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. ఇంకా సమీపంలోని ఆలయానికి వెళ్లి రావడం ఉత్తమం అని.. ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు