రోహిత్ శర్మ ప్రపంచ కప్ పోటీల్లో ఆడుతాడా? లేదా?

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:34 IST)
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ పోటీల్లో ఆడుతాడా లేదా అనే దానిపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మకు తీవ్ర గాయం ఏర్పడింది. 
 
మైదానంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. రోహిత్‌కు డైవ్ చేసే క్రమంలో కుడికాలు కండరాలు పట్టేశాయి. దీంతో మైదానంలోనే రోహిత్ విలవిల్లాడగా, జట్టు డాక్టర్ నితిన్ పటేల్ రోహిత్‌ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. 
 
రోహిత్‌కు గాయం తీవ్రత ఎక్కువగా వుందని.. అతనికి ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చేశారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లోపు రోహిత్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్టు ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. 
 
కాగా, ఈ నెల 15న జట్టును బీసీసీఐ ప్రకటించనుండగా, ఆ సమయానికి రోహిత్ కోలుకుంటేనే అతని పేరును పరిశీలిస్తారని, లేకుంటే కోలుకున్న తరువాత జట్టులో చేర్చే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
రోహిత్ శర్మ గాయం క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. రోహిత్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగేది అనుమానమేనని క్రీడా పండితులు చెప్తున్నారు. వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ విశ్రాంతి తీసుకుంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు