ఓడలో వెళ్తున్నట్టు కలవస్తే..?

మంగళవారం, 26 మార్చి 2019 (13:13 IST)
చాలామందికి ఓడలో వెళ్లాలంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. మరికొందరికేమో ఓడలో వెళ్లాలంటే.. భయంగా ఉంటుంది. అలాంటిది.. ఓడలో వెళ్తూడంగా వచ్చే కలల వలన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. 
 
ఓడలో వెళ్తూండగా ఓడ తిరగబడినట్లు కలవచ్చిన మిక్కిలి ఆపదలు ధన నష్టం కలుగును. ఓడ రేవును చూసినట్లు కల వచ్చినా వ్యాపారాభివృద్ధి, ధనలాభం కలుగును. ఓడ నుండి కిందకి దిగుచున్నట్లు కల వచ్చిన తలచిన కార్యాలు నెరవేరును. 
 
ఓడలో మునిగిన అందులోనున్నవారు రక్షింపబడినట్లు కల వచ్చిన కష్టాలు కలుగును. ఓడలో దొంగతనం చేయువానిని చూసినట్లు కలవచ్చిన అనారోగ్యం కలుగును. ఓడలో ప్రయాణం చేయు వారిని కలలో చూసిన సాహసములతో కూడిన ప్రయాణం చేయుదురు. ఓడ నీటిలో పూర్తిగా మునిగినట్లు కలవచ్చిన అశుభాలు కలుగును. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు