01-11-2023 నుంచి 30-11-2023 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

మంగళవారం, 31 అక్టోబరు 2023 (23:09 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒంటెద్దుపోకడ తగదు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వనసమారాధనలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
ప్రతికూలతలు అధికం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. దళారులను ఆశ్రయించవద్దు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలించవు. యోగ, ధార్మికతలపై ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిరుద్యోలకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఒడిదుడుకులెదుర్కుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంప్రదింపులకు తగిన సమయం. వ్యవహారాల్లో ఫలితాలు మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. పనులు వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభయోగం. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుపడుతుంది. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలించదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పదవీయోగం. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఈ మాసం అనుకూలదాయకం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
వ్యవహారానుకూలతలున్నాయి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వ తగదు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు శుభయోగం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఈ మాసం అన్ని రంగాల వారికీ యోగదాయకమే. అభీష్టం నెరవేరుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. పత్రాల్లో సవరణలను అనుకూలించవు. పట్టుదలతో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.  వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. వాహనదారులకు దూకుడు తగదు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల్లో శ్రమ, జాప్యం అధికం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. వనసమారాధనలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనుర్రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలదాయకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న మీ కోరిక నెరవేరదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ప్రత్యర్థులతో జాగ్రత్త. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. గృహంలో సందడి నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పందాలు, జూదాలకు పాల్పడవద్దు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలం. వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులను నమ్మవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుభకార్య యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. కొత్త బంధుత్వాలేర్పడతాయి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పాతపరిచయస్తుల కలయిక అనుభూతినిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. భేషజాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆకస్మిక ఖర్చులు చికాకుపరుస్తాయి. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్టసమయం. వాహనదారులకు దూకుడు తగదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు