సంకష్టహర చతుర్థి వ్రతం.. ఫలితాలు.. ఏంటంటే? (video)

గురువారం, 2 జులై 2020 (16:17 IST)
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని స్తుతించేందుకు పలు వ్రతాలున్నప్పటికీ.. సంకటాలను తీర్చే సంకష్టహరచతుర్థికి ప్రత్యేక విశిష్టత వుంది. అలాంటి సంకష్టహరచతుర్థి రోజున వ్రతమాచరిస్తే సకల సంపదలు చేకూరుతాయి. సంకష్ట చతుర్థి రోజున వ్రతమాచరిస్తే సకల సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పౌర్ణమికి వచ్చే నాలుగో రోజు సంకష్ట హర చతుర్థి రోజున ఉపవాసముంటే ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
 
సంకష్టహర చతుర్థి రోజున వ్రతమాచరించే వారికి సుభీష్టాలు చేకూరుతాయి. శనిదోషాలు తొలగిపోవాలంటే సంకష్ట హర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే ఈతిబాధలుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అందుకే ప్రతి నెలలో వచ్చే సంకష్ట హర చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేయించి.. గరిక సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే 21 పత్రాలతో అర్చన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 9, 11, 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితినాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే స్నానమాచరించి.. గణపతిని పూజించాలి. ఆరోజున సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవాలి. ఓ పసుపు వస్త్రంలో గుప్పెడు బియ్యం, రెండు వక్కలు, తమలపాకులు, రెండు ఖర్జూరాలు, దక్షిణ పెట్టి.. సంకల్పం చేసుకోవాలి. 
 
ఆ మూటను మూటకట్టి.. గణపతి ముందుంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ, నైవేద్యం పెట్టి నివేదించాలి. సాయంత్రం పూట ఆ బియ్యంతో పొంగలి తయారు చేసుకుని స్వామివారికి ప్రసాదం సమర్పించి తీసుకోవాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఇకపోతే.. జూలై తొమ్మిదో తేదీన సంకష్టహర చవితి వస్తోంది. ఆ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి.. ఉండ్రాళ్ళు, శెనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 


 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు