07-09-2019 మీ రాశి ఫలితాలు... ఆ రాశి వారు స్థిరాస్తుల విషయంలో...

శనివారం, 7 సెప్టెంబరు 2019 (10:27 IST)
మేషం: రవాణా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. చేపట్టిన పనుల్లో ఓర్పు, లౌక్యం అవసరం. బంధుమిత్రుల రాకపోకలు ఉల్లాసాన్నిస్తుంది. ప్రముఖుల కలయికతో వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
వృషభం: ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో క్షణం తీరికుండదు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.
 
మిధునం: స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. గృహంలో మార్పలు, చేర్పులు వాయిదా పడతాయి.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విద్యార్థినులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్థిరచరాస్తులకు సంబంధించి ముఖ్యలతో ఒప్పందాలుకుదుర్చు కుంటారు.
 
సింహం: మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహిస్తారు.
 
కన్య: కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. కోర్టు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. ప్రభుత్వోద్యోగులకు దీర్ఘకాలిక సెలవు, లోన్లు మంజూరు కాగలవు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
తుల: మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించటంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. మీ సమర్థతను అధికారులు గుర్తిస్తారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకు లెదురవుతాయి. భాగస్వామిక చర్చులు అర్థాంతంగా ముగుస్తాయి.
 
ధనస్సు: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. కోర్టు సమస్యల నుండి బయటపడతారు. మీ మంచితనంతో ఇతరులు లబ్ధి పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారాలకు అన్ని విధాల కలిసిరాగలదు.
 
మకరం: ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం విద్యా, వివాహ విషయంలో బాగా శ్రమిస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
కుంభం: విదేశీయానం, రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు షాపింగ్‌లో ఏకాగ్రత అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అకాలభోజనం, శ్రమాధిక్త వల్ల స్వల్ప అస్వస్థకు గురవుతారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహనకు వస్తారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.
 
మీనం: స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలం. దైవసేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన కుటుంబ అవసరాలు ఆందోళన కలిగిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు