రోజూ ఉదయం పక్షులకు బిస్కెట్లు పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (15:47 IST)
శని దేవుడిని శాంతింపచేసేందుకు పూజలు, అభిషేకాలే కాదు.. దానాలు కూడా చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శనీశ్వరుడిని శాంతింపజేయాలంటే మూగ జీవాల పట్ల దయ కలిగి వుండాలని వారు చెప్తున్నారు. పశువులకు, పక్షులకు, చీమలకు ఆహారాన్ని అందించడం వల్ల శని దోషం తొలగిపోతుందట. ప్రతిరోజూ ఉదయం కాకులకు లేదా పక్షులకు బిస్కెట్లు, లేదా తీపి పదార్థాలను పెట్టే వారికి శనిగ్రహ దోషాలు తొలగిపోవడంతో పాటు అప్పుల బాధలుండవని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే శనిదేవునికి ఇష్టమైన సప్తముఖి రుద్రాక్షను ధరించడం వలన, నీలమణిని ఉంగరంలో ధరించడం వలన శని దోష ప్రభావం తగ్గుతుంది. తద్వారా శని దేవుని నుంచి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
రుద్రాక్ష మాల, సప్తముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివ స్వరూపమని, పరమ పవిత్రమైనదని పురాణాలు చెప్తున్నాయి. రుద్రాక్ష మాలను ధరించి చేసే శివపూజ వలన విశేష ఫలితాలుంటాయి. రుద్రాక్షమాలతో చేసే జపం వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. రుద్రాక్షమాలను ధరించి చేసే శివారాధన వలన, ఆ స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. 
 
రుద్రాక్ష మాలను ధరించడం వలన సమస్త దోషాలు, శనిగ్రహ దోషాలు, పాపాలు నశించిపోతాయి. రుద్రాక్షమాలను ధరించినవారిని దుష్ట శక్తులు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు