ఇంటిల్ల పాదిని శుభ్రం చేసుకుని.. పూజకు అంతా సిద్ధం చేసుకుని మహాలక్ష్మిని 108 అష్టోత్తరాలతో కుంకుమార్చన చేసి.. ఆపై పాలతో చేసిన తీపి పదార్థులు, రవ్వతో చేసిన తీపి పదార్థాలు, ఉసిరికాయను తప్పకుండా నైవేద్యంగా సమర్పించినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం వుంటుంది. ఇంకా అనురాధా నక్షత్రం రోజున ఈ పూజను శుక్ర హోరను క్యాలెండర్‌లో సరి చూసుకుని చేయడం మంచిది. సాధారణంగా శుక్ర హోర ఫిబ్రవరి 21 ఉదయం 6-7 గంటల మధ్య, మధ్యాహ్నం 1-2 గంటల మధ్య వుంటుంది. ఆ సమయంలో ఈ పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
27 నక్షత్రాల్లో ఒకటైన అనురాధ నక్షత్రం శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరమని.. అందుకే ఈ రోజున తనను పూజించే వారికి సకలసంపదలు, ఆయురారోగ్యాలు, ప్రసాదిస్తుందని విశ్వాసం.