శ్రీ కృష్ణాష్టమి నాడు వెన్న, పాలు, పెరుగును మర్చిపోకూడదు..

మంగళవారం, 11 ఆగస్టు 2020 (11:35 IST)
శ్రీ కృష్ణాష్టమి నాడు ఉపవాస దీక్ష చేసే భక్తులు ఉదయం వేళ పూజలు చేసి సంకల్పం చెప్పుకుంటారు. పంచామృతాలతో శ్రీకృష్ణుడి ప్రతిమను శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, నగలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు. నైవేద్యంగా స్వీట్లు పెడతారు. ఉయ్యాలలో ఉంచి స్వామిని పూజిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా దహీ హండీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. 
 
అలాగే కృష్ణాష్టమి సందర్భంగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శనగపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు.. సొంఠితో తయారు చేసిన కట్టెకరం, చక్కెర కలిపిన మినప్పిండిని కూడా నైవేద్యంగా పెడతారు. ఈ రెండూ బాలింతలకు పెట్టే ఆహారం కావడం గమనార్హం. ఎందుకంటే అప్పుడే శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు