గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవనమస్కృతః
ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమ
శరీరారోగ్యద శ్చైవ ధనవృద్ధి యశస్కరః
స్తవరాజ ఇతి ఖ్యాతస్రీషులోకేషు విశ్రుతః"
అనే ఈ శ్లోకాన్ని ప్రతి రోజు స్నానానంతరం.. సూర్యోదయం సమయంలో సంధ్యాకాలాలలో పఠించినవారు సర్వపాప విముక్తులవుతారు. ధనవృద్ధి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వేదాల ప్రకారం ఆరోగ్యంతు భాస్కరం అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేది భాస్కరుడు అంటే సూర్యుడు. ఇదే విషయాన్ని భవిష్యపురాణం చెప్తోంది. సాంబుడు అనేవాడు అనారోగ్యంతో బాధపడి సూర్యభగవానుడిని ఆరాధిస్తాడు.