స్వర్ణాకర్ష భైరవుడిని ఎలా పూజించాలి...?

బుధవారం, 11 ఆగస్టు 2021 (23:29 IST)
swarna Bhiravar
రుద్రుడే మానవుల కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు. త్రిమూర్తులను ఆ సదాశివుని అంశగా నిర్వహించే వాడే శ్రీ కాలభైరవ స్వామి. మన మెదడులో వుండే రక్త ఎరుపు కణాలను నిర్వహించేవారే సూర్యుడే. ఒక్కో జాతకుడికి ఆత్మకారకుడు కూడా సూర్యుడే. 
 
అలాంటి సూర్యుడికి ప్రాణ దైవమే శ్రీ స్వర్ణాకర్ష  భైరవుడే. రాజాధి రాజులు ఈయనను స్తుతించి ప్రార్థించినట్లు పురాణాలు చెప్తున్నాయి. స్వర్ణాకర్ష భైరవుడిని అష్టమి రోజున స్తుతించాలి. ఆయనను స్తుతించే సమయంలో మద్యానికి, మాంసానికి దూరంగా వుండాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
స్వర్ణ ఆకర్ష భైరవుడు.. కాల భైరవ యొక్క శక్తివంతమైన రూపాలలో ఒకటి. స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ మంత్రం, జపం, మరియ యజ్ఞం చేయడం వలన కొత్త ఆస్తులను కొనుగోలు చేయడం, ఇతరులకు సహాయం చేయగల సామర్థ్యం, ఆర్థిక సమస్యల నుండి నివారణ పొందడం వంటివి జరుగుతాయి. 
 
అలాగే నగదు.. బంగారానికి లోటుండదు. స్వర్ణ ఆకర్షణ భైరవ అని పిలువబడే స్వర్ణకర్షణ భైరవ, మీ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వీలు కల్పిస్తాడు. "స్వర్ణ" అనే పదానికి బంగారం అని అర్థం. ఇది లక్ష్మీ దేవిని సూచిస్తుంది. తత్ఫలితంగా స్వర్ణ ఆకర్షణ భైరవుడిని పూజించడం వలన బంగారం మరియు ధనం సమృద్ధిగా లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు