గురువారం మీ రాశిఫలితాలు .. దంపతుల మధ్య...

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (08:34 IST)
మేషం : కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. దంపతుల మధ్య కలహం తలెత్తుంది. 
 
వృషభం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చికాకులు ఎదుర్కొంటారు. సొంత వ్యాపారాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. 
 
మిథునం: నిత్యవసర వస్తు ధరలు అధికమవుతాయి. బంధువులు మీ నుంచి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో శ్రమాధిక్యత తప్పదు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. సన్నిహితులతో కలిసి దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి సఖ్యత అంతగా ఉండదు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. నిర్మాణ పనులు చురుకుగా సాగటంతో మీలో సంతృప్తి కానవస్తాయి.
 
సింహం: చేతి వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్, మెకానికల్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సన్నిహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కన్య: ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంక్ వ్యవహారాల్లో కొత్త సమస్యలు తలెత్తగలవు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కళలు, రాజకీయ, ప్రజా సంబంధాల వారికి ఒత్తిడి, చికాకులు వంటివి అధికం.
 
తుల: చేపట్టిన వ్యాపారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు చిన్న సదవకాశం లభించినట్లైతే సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఒప్పందాల్లో అనుభవజ్ఞులను సంప్రదించండి. 
 
వృశ్చికం: స్త్రీల ఎదుటివారి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. నిర్ణయాలు, అభిప్రాయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
ధనస్సు: ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో అసహనానికి లోనవుతారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి వుంటుంది. 
 
మకరం : ధనవ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ ప్రయాణాలు ఇతరుల కారణంగా వాయిదాపడటంతో నిరుత్సాహానికి లోనవుతారు. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
 
కుంభం: సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. 
 
మీనం: ఆధ్యాత్మిక చింతన, ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ఆకర్షణలకు దూరంగా ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు