శనివారం మీ రాశి ఫలితాలు... కానివేళలో బంధువుల రాక ...
శనివారం, 10 మార్చి 2018 (06:09 IST)
మేషం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
వృషభం: విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులు పోగొట్టుకున్న వారికి అందించి మీ నిజాయితీని చాటుకుంటారు.
మిథునం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలతో మోసపోయే వీలుంది.
కర్కాటకం: సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. కానివేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. విదేశాలు వెళ్ళేందుకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
సింహం: ఉద్యోగస్తులకు విధుల్లో చిక్కులు ఎదురైనా అధికమిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. అనుకున్న పనులు సాఫీగా పూర్తి చేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు.
కన్య: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రైవేట్ సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది.
తుల: రాజకీయ, కళారంగాలలోని వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
వృశ్చికం: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడగలవు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. ఉపాధ్యాయులకు ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది.
ధనస్సు: భూముల క్రయ, విక్రయాల్లో నష్టపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. రుణ దాతలను మంచి మాటలతో సంతృప్తిపరచడం శ్రేయస్కరం. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ప్రేమికులు పెద్దల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
మకరం: శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు అధికారులు, సహోద్యోగుల ప్రశంసలందుకుంటారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. లిటిగేషన్ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. మీ సంతానం విషయంలో కొన్ని స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభం: కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. రాజకీయ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు తీసుకునే రుణాలకు మధ్యవర్తి సంతకం చేయవలసివస్తుంది. మీ తొందరపాటుతనం, మతిమరుపు కారణంగా అధికారులతో మాటపడతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
మీనం: ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. బంధువుల నుంచి వచ్చిన వార్తలతో ఆనందం కలుగుతుంది. కీలకమైన నిర్ణయాలతో సొంత నిర్ణయాలు, ఆలోచనలు శ్రేయస్కరం.