శివుని ఆరాధనలో బిల్వ పత్రాలకు కీలక పాత్ర వుంది. బిల్వ పత్రాలు త్రిశూలానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే మూడు శక్తులకు సంబంధించిన అంశంగా బిల్వం పూజించబడుతుంది.
శ్రీ మహాలక్ష్మి సముద్రం నుండి ఉద్భవించినప్పుడు, ఆమె చేతుల నుండి బిల్వ పత్రాలు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ వృక్షం మహాలక్ష్మి నివాసం. బిల్వ వృక్షం కొమ్మలను వేదాలుగానూ, ఆకులను శివ స్వరూపంగానూ పూజిస్తారు.
గంగ వంటి పుణ్య నదులలో స్నానం చేసినంత మేలు జరుగుతుంది. 108 దేవాలయాలను దర్శించినంత పుణ్యం దక్కుతుంది. బిల్వం ఆకు, పువ్వు, వేరు, పండు, బెరడులలో ఔషధ గుణాలు ఉన్నాయి.
బిల్వ పత్రాలతో పూజతో శివానుగ్రహం పొందవచ్చు. ఏలినాటి శనిదోషం ఉన్నవారు బిల్వార్చన చేయడం ఉత్తమం. బిల్వ పత్రాలను సోమవరం, చతుర్థి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో చెట్టు నుండి తీయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.