ఆ ఆరు చోట్ల పుట్టుమచ్చలు ఉంటే... వచ్చిన డబ్బు వచ్చినట్లు పారిపోతుందట...
సోమవారం, 21 నవంబరు 2016 (17:20 IST)
పుట్టుమచ్చలు శరీరంపైన ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఐతే పుట్టుమచ్చల శాస్త్రంలో శరీరంలో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్నది చెపుతుంది. ముఖ్యంగా ఆరుచోట్ల ఉండే పుట్టుమచ్చల వల్ల ధనం లేకుండా పోతుందట. అవేంటో ఒక్కసారి చూద్దాం.
స్త్రీకి ఎడమవైపున పై పెదవికి కాస్త పైన, చెక్కిలికి కిందుగా పుట్టుమచ్చ ఉంటే ఆమె ధనాన్ని ఎంత పట్టి ఉంచుదామన్నా ఉండదట. వచ్చిన డబ్బు వచ్చినట్లు పోతూనే ఉంటుందట.
అలాగే స్త్రీకి ఎడమ బుగ్గపైన పుట్టుమచ్చ ఉంటే ధన ప్రవాహం జోరుకు హద్దే ఉండదు. ఐతే ఎంత ప్రవాహంతో వస్తుందో అంతే ప్రవాహంతో వెళ్లిపోతుందట.
పురుషుడికి కింది పెదవి క్రిందుగా పుట్టుమచ్చ ఉంటే అతడు ఎప్పుడు చూసినా ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటాడు. అలాగే పురుషుడికి అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చేతికి వచ్చిన డబ్బు నిలువదు. ఎంత ప్రయత్నించినా పొదుపు చేయలేని పరిస్థితి దాపురిస్తుంది.
ఇంకా ఎడమ కాలు పైన ఎక్కడయినా పుట్టుమచ్చ ఉంటే వారి వద్ద కూడా ధనం నిలువదట. డబ్బు ఖర్చు చేయకూడదని ఎంతో కష్టించి పొదుపు చేసినా అంతా కలిసి ఒకేసారి వెళ్లిపోతుందట. అలాగే చేతి వేళ్ల మధ్య ఉండే పుట్టుమచ్చ వల్ల కూడా ఇలాంటి ఫలితాలే కలుగుతాయట.