మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత కిరాతకంగా ఓ రైతును హత్య చేయడమే కాకుండా.. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతు భార్య, ఇద్దరు పిల్లలపై కూడా దుండగులు దాడి చేయించారు. ఇంకా ఆ రైతు కుమార్తె పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించాడని.. ఆమె దుస్తులు చించివేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
వివరాల్లోకి వెళ్తే.. గణేశ్ పుర గ్రామానికి చెందిన రైతు రామ్ స్వరూప్‌కు, స్థానిక బీజేపీ నేత మహేంద్ర నాగర్‌కు మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. దీంతో మహేంద్ర అనుచరులతో రైతు కుటుంబంపై దాడి చేశాడు. మొదట రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి, అనంతరం థార్ జీపుతో తొక్కించడంతో రామ్ స్వరూప్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.