ఈ సందర్భంగా ఈ విచిత్రమైన ప్రకటన చేశారు. తాము డియెల్లాతో సాహసం చేశామని, తొలిసారిగా డియెల్లా గర్భవతి అయింది. అదీ 83 మంది పిల్లలను జన్మనివ్వనుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఈ 83 మంది ఏఐ పిల్లలు పార్లమెంటులోని సోషలిస్ట్ పార్టీకి చెందిన 83 మంది ఎంపీలకు డిజిటల్ సహాయకులుగా పనిచేస్తారని కూడా ఆయన ప్రకటించడం సంచలనానికి దారి తీసింది. పార్లమెంటు కార్యకలాపాలను పూర్తిగా రికార్డ్ చేయడం, ఏదైనా కారణంతో సమావేశానికి హాజరుకాలేకపోయిన ఎంపీలకు సమాచారం అందించడం వీరి పని అని ఆయన వివరించారు.
ఈ పిల్లలు సభలో సభ్యులు కాఫీలు తాగడానికి వెళ్తే.. వారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తారు. అంతేగాకుండా ప్రత్యర్థులకు ఎలా కౌంటరివ్వాలో కూడా చెప్తాయని వెల్లడించారు. అల్బేనియా భాషలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఈ ఏడాది జనవరిలో ప్రధాని ఎడి రేమా ఈమెను తొలి ఏఐ మంత్రిగా పరిచయం చేశారు. ఈ -అల్బేనియా ప్రభుత్వ పోర్టల్‌లో ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో ఈ డిజిటల్ అసిస్టెంట్ సహాయం చేస్తోంది.