పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

ఐవీఆర్

సోమవారం, 27 అక్టోబరు 2025 (21:20 IST)
తన తల్లిదండ్రులు ఎంతకీ తనకు పెళ్లి చేయడం లేదని ఓ యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. తనకు పెళ్లి చేస్తానని మాట ఇస్తేనే అక్కడి నుంచి దిగుతానంటూ మొండికేశాడు. అతడికి నచ్చజెప్పేందుకు పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా అతడు వినలేదు. 
 

షాకింగ్ విజువల్స్

తనకు పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు

అబ్దుల్లాపూర్‌మెట్‌లో సంఘటన

పోలీసులు, విద్యుత్ అధికారులు కిందకి దించే ప్రయత్నంలో, వారి నుండి తప్పించుకొని దూకిన యువకుడు

టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం pic.twitter.com/2IOjeQnPc1

— Telugu Scribe (@TeluguScribe) October 27, 2025
దాంతో అతడిని కిందకు దించేందుకు సిబ్బంది ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు ఆ టవర్ పైనుంచి జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు