మంగళవారం పూట కుంకుమ కింద పడితే..? (video)

మంగళవారం, 6 అక్టోబరు 2020 (05:00 IST)
మంగళవారం, శుక్రవారాల్లో కుంకుమ కింద జారిపడితే.. అదెదో అశుభంగా భావిస్తారు చాలామంది. అయితే ఇది అపోహ మాత్రమేనని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అనుకోకుండా కుంకుమ కింద పడినప్పుడు అలా పడినచోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమను  చెట్లలో వేయాలి. నిజానికి కుంకుమగానీ కుంకుమ భరిణ కింద పడటం గానీ శుభ సూచకం. 
 
భూమాత తనకు బొట్టు పెట్టమని చేసే సంకేతం అది. ఏదైనా పూజ గానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగానే భావించాలి. అలాంటి అదృష్టాన్న అశుభంగా భావించడం.. బాధపడటం సరికాదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే మంగళ, శుక్ర వారాల్లో కుంకుమ చేజారి పడినా శుభమేనని వారు చెప్తున్నారు. 
 
ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. మంగళవారం వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారం లో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం వారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు