ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున తిలా తర్పణం ఇవ్వడం.. అన్నదానం చేయడం మంచిది. ఇలా చేస్తే పితృదేవరుల ఆశీర్వాదం లభిస్తుంది. గరుడ పురాణంలో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పూజలు చేయడం ద్వారా, వ్రతమాచరించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చునని పేర్కొనబడింది. అమావాస్య వ్రతం రోజున నదీ స్నానం, పుణ్యతీర్థ స్థానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
అలాగే నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇలా చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం.. శివపూజ, శని పూజ, హనుమాన్ పూజ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు.