శనివారం శ్రీలక్ష్మికి, శ్రీవారికి ఈ పువ్వులను సమర్పిస్తే..?

శనివారం, 7 నవంబరు 2020 (05:00 IST)
Flowers
శనివారం పూట శ్రీవారికి, శ్రీలక్ష్మికి తామర పువ్వులు, జాజిపువ్వులు, రోజా పువ్వులు, పన్నీరు రోజా పువ్వులు సుగంధంతో కూడిన పువ్వులు సమర్పిస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

అలాగే మందార పువ్వును విష్ణువుకు సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ పువ్వును శనివారం పూట పూజగదిలో వుంచి పూజించినట్లైతే శుభాలు చేకూరుతాయి. ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు వుండవు. ప్రతికూల ఫలితాలు వుండవు. అనుకూల ఫలితాలుంటాయి. 
 
అలాగే అచ్యుతా అని శనివారం రోజున స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. నరసింహా అని స్మరిస్తే.. మీ శత్రువులపై మీదే విజయం. అదే నారసింహా అని స్మరిస్తేసకల భయాల నుంచి విముక్తి లభిస్తుంది. శనివారం పూట గోవిందా అని స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది. శనివారం పూట శ్రీలక్ష్మీవిష్ణువులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం తులతూగుతుంది. 
 
కృష్ణకృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి. సర్వేశ్వరా అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. శివశివ అని స్మరిస్తే సకలాభీష్టాలు చేకూరుతాయి. జగజ్జననీ, జగన్మాతా అని స్మరిస్తే.. సకల అరిష్టాల నుంచి విముక్తి, సర్వభయాలు తీసి ప్రశాంతత లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు