Sambrani on Saturday: శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా?

సెల్వి

శుక్రవారం, 22 ఆగస్టు 2025 (21:32 IST)
Sambrani
శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల్లోపు.. అలాగే సాయంత్రం 6-7 గంటల్లోపు, అలాగే రాత్రి 8-9 గంటల్లోపు సాంబ్రాణి వేయడం ద్వారా సోమరితనం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈతిబాధలు తగ్గుతాయి.శనేశ్వరుడు, భైరవుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఆదివారం సాంబ్రాణి వేయడం ద్వారా ఆత్మబలం పెరుగుతుంది. ఈశ్వరుడి అనుగ్రహంతో పాటు సిరి సంపదలు, కీర్తి, ప్రతిష్టలు వస్తాయి. అలాగే సోమవారం సాంబ్రాణి వేయడం ద్వారా దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
 
ముఖ్యంగా మంగళవారం సాంబ్రాణి వేస్తే నరదృష్టి దోషాలు దూరమవుతాయి. అప్పుల బాధలు తగ్గుతాయి. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. శత్రుభయం, ఈర్ష్య, అసూయ తొలగిపోతాయి. 
 
బుధవారం
నమ్మక ద్రోహం, ఇతరుల కుట్రల నుండి రక్షణ కలుగుతుంది. మహానుభావుల ఆశీర్వాదం. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
 
గురువారం
సత్ఫలితాలు, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
 
శుక్రవారం
మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది.
శుభకార్యాలు, అన్నింటిలోనూ విజయాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు