నిలువుబొట్టు పెట్టుకుంటే రక్తదోషాలను హరిస్తుందట!

బుధవారం, 11 ఏప్రియల్ 2012 (16:55 IST)
FILE
ఊర్థ్వపుండ్రమంటే నిలువుబొట్టు పెట్టుకోవడం. వైష్ణవాగమాలననుసరించి ఇది ఏర్పడింది. నామాలకు ఉపయోగించే తిరుమణి ఒకవిధమైన మట్టి. తిరుమణిలోని తెలుపు స్వచ్ఛమైన పరమాత్మతత్త్వాన్ని తెలుపుతోంది. మధ్యపెట్టుకునే తిరుచూర్ణం రక్తదోషాలను హరిస్తుంది.

మూడు నిలువురేఖలు అకార, ఉకార, మకార రూప ప్రణవాన్ని సూచిస్తున్నాయి. అకారం సత్త్వరూపమైన విష్ణువును, ఉకారం చిత్‌స్వరూపమైన లక్ష్మిని, మకారం భాగవతులైన భక్తులను సూచిస్తున్నాయి. ఊర్థ్వపుండ్ర తత్త్వాన్ని శ్రీమన్నారాయణోషనిషత్తు, వాసుదేవోపనిషత్తు, విష్ణుపురాణాలు స్పష్టపరిచాయి.

నామాలను దిద్దుకునేటప్పుడు ఆయాచోట్ల ఆయాదేవతలను భావించుకోవాలి. లలాటంపై కేశవుని, ఉదరంపై నారాయణుని, వక్షస్థలంపై మాధవుని, కంఠంపై గోవిందుని, పొట్టకు కుడివైపు విష్ణువును, దానిపక్క, బాహు మధ్యంలో మధుసూదనుని, చెవులపై త్రివిక్రముని, పొట్టపై వామనుని, మెడపై దామోదరుని స్మరించవలెనని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా కానప్పుడు కేశవాది ద్వాదశనామాలనైనా చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి