అలాగే ఉద్యోగినులు పవర్ న్యాప్ కూడా చేయాలని వైద్యులు చెప్తున్నారు. ఉద్యోగినులకు నిద్రలేమి సమస్య ఎదురవుతుంటుంది. ఉద్యోగినులు ఐదారు గంటలైనా నిద్రపోరు. ఆ ప్రభావం తరువాతి రోజుపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడుతాయి. అందుకే ఓ పని చేయాలి. అదేంటంటే అవకాశం ఉన్నప్పుడల్లా పది నుంచి 15 నిమిషాలు కునుకు తీసేందుకు ప్రయత్నించండి. దీన్ని పవర్ న్యాప్ అంటారు. అలా చేస్తే రోజంతా చురుగ్గా వుండొచ్చునని అధ్యయనాలు తేల్చాయి.
ఒత్తిడికి లోనుకాకుండా వుండాలంటే ప్రణాళిక వేసుకోవాలి. రోజంతా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల జోలికి వెళ్లకూడదు. అంటే వారంలో ఓ రోజు నో టెక్నాలజీ డే అని పెట్టుకుంటే.. అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.