శాండ్‌విచ్ ఆలస్యంగా తెచ్చాడనీ వెయిటర్‌ను కాల్చిచంపిన కస్టమర్

ఆదివారం, 18 ఆగస్టు 2019 (13:32 IST)
ఇటీవలి కాలంలో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ముఖ్యంగా, కొంతమంది మనుషులు సాటి మనుషుల పట్ల క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తన శాండ్‌విచ్‌ను ఆలస్యంగా తెచ్చినందుకు ఓ వెయిటర్‌ను కస్టమర్ తుపాకీతో కాల్చిచంపాడో కస్టరమ్. ఈ దారుణ ఘటన యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లో జరిగింది. ఈ ఘటన శుక్రవారం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు పారిస్‌లోని నాయిసీలే గ్రాండ్‌ హోటల్‌లో ఓ వ్యక్తి వచ్చాడు. తనకు శాండ్‌విచ్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆహారం తీసుకురావడంతో కొంత ఆలస్యమైంది. దీంతో సహనం కోల్పోయిన సదరు కస్టమర్.. 'శాండ్‌విచ్ తీసుకురావడానికి ఇంత ఆలస్యం చేస్తావా?' అంటూ సదరు వెయిటర్‌తో గొడవకు దిగాడు. అయితే, తన ఆలస్యానికి గల కారణాన్ని వెయిటర్ వివరిస్తున్నా.. ఏమాత్రం వినిపించుకోని కస్టరమ్ అతనిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో భుజంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో కుప్పకూలిపోయిన వెయిటర్, తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన వ్యక్తులు స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారనీ, వీరిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు