దైనందిన జీవితంలో మహిళలు విజయసాధన కోసం ఇంట, బయట అనే తేడా లేకుండా అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. విజయాన్ని సొంతం చేసుకునేందుకు పోరాడే మహిళలకు చిరునవ్వు ఎంతగానో ఉపకరిస్తుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
కుటుంబంలో కుమార్తేగా, ఇల్లాలిగా, తల్లిగా, అత్తగా, కోడలిగా ఇలా... ఎన్నో బాంధవ్యాలతోనే కాకుండా ఉద్యోగినిగా తన జీవిత సరళిని సాగిస్తున్న ఆధునిక మహిళ అనునిత్యం విజయసాధన కోసం తపిస్తోంది. అటువంటి మహిళకు కుటుంబంలో ఇతరులతో మనస్పర్ధలు చోటుచేసుకోకుండా ఉండేందుకు చిరునవ్వు చాలు.
చిరునవ్వు వలన సమస్యలు తీరడమేకాకుండా ఎదుటి వారిని ఆకర్షించ గలరు. కార్యాలయ్యాల్లో మహిళలు తమ ఉన్నతిని చాటుకునేందుకు చిరుమందహాసం బాగా ఉపకరిస్తుంది. నవ్వు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా మానసిక ఉత్సహాన్ని మెరుగుపరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిత్యం ఎదురయ్యే అతి క్లిష్టమైన సమస్యనైనా చిరునవ్వుతో చిటికెలో పారద్రోలవచ్చని, నవ్వు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా సౌందర్యాని కూడా మెరుగుపరుస్తుందని వారు వెల్లడిస్తున్నారు.