"ఓ కార్తీక దామోదరా..!" నీకు నమస్కారము

తులాసంస్థే దినకరే కార్తికే మాసి యో నరః 1

స్నానం దానం పితృశ్రాద్ధ మర్చనం శుద్ధమానసః

తదక్షయ్య ఫల ప్రాహుర్యత్కరోతి నరేశ్వర 1

సక్రమం వా సమారభ్య మాసమేకం నిరంతరమ్ 2

మానస్య ప్రతి పద్యాం వా ప్రారభేత్కార్తికవ్రతమ్ 1

నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే

ఇతి సంకల్ప్య విధిత త్పశ్చాత్స్నానం సమాచరేత్1

కార్తీకమాసములో సూర్యోదయ కాలమునకు పూర్వమే లేచి స్నానమాచరించి జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యములను చేసినట్లైతే కీర్తి ప్రతిష్టలు ప్రాప్తిస్తాయని ఆర్యుల విశ్వాసం.

సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండి గాని, కార్తీక మాసారంభ దినమగు శుద్ధ పాడ్యమి మొదలు కొని వ్రతారంభమును ప్రారంభించాలి.

అట్లు ప్రారంభించే సమయంలో "ఓ కార్తీక దామోదరా..!" నీకు వందనములని నమస్కరించుకుని వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేయాల్సిందిగా పై శ్లోకమును స్తుతిస్తూ... వ్రతాన్ని ఆరంభించాలి.

వెబ్దునియా పై చదవండి