Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

సెల్వి

శనివారం, 26 ఏప్రియల్ 2025 (20:28 IST)
Sarva Amavasya
సర్వ అమావాస్య ఏప్రిల్ 27వ తేదీన వస్తోంది. సర్వ అమావాస్య రోజున శ్రాద్ధం చేయడం మరిచిపోకూడదు. ఎల్లప్పుడూ పూర్వీకులకు సువాసనగల పువ్వులను సమర్పించాలి. ముఖ్యంగా గులాబీ లేదా తెలుపు-రంగు సువాసనగల పువ్వులను చేర్చాలి. ఎల్లప్పుడూ నది లేదా సరస్సు ఒడ్డున పిండప్రదానం చేయాలి. ఇంకా మాంసాహారం, ఆవాలు, బార్లీ, జీలకర్ర, ముల్లంగి, నల్ల ఉప్పు, పొట్లకాయ, దోసకాయ, మిగిలిన ఆహారం తీసుకోకపోవడం మంచిది. సర్వపితృ అమావాస్య నాడు ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపాలి. 
 
ఈ రోజున మద్యపానం, మాంసాహారం తీసుకోకూడదు. ఇంకా బ్రాహ్మణులకు అన్నదానం, కూరగాయలు దానం చేయడం మంచిది. ఈ అమావాస్య రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, శివునికి నేతిదీపం వెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరచేందుకు అర్ఘ్యమివ్వడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చునని పండితులు అంటున్నారు. 
 
అమావాస్య వేళ పూర్వీకులకు ఇష్టమైన పనులను చేయడం మంచిది. మీ పూర్వీకులకు ఇష్టమైన నైవేద్యాలు చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శక్తి మేరకు దానం చేయడం మంచిది. పితృదోషాలు తొలగిపోవాలన్నా, జాతక రీత్యా ఇబ్బందులను దూరం చేసుకోవాలన్నా, సర్వ అమావాస్య రోజున పితరులను పూజించడం తప్పక చేయాలి. అవిసె ఆకులను గోమాతకు ఇవ్వాలి. ఇలా చేస్తే పితరులను సంతృప్తి చెందుతారని.. వంశాభివృద్ధికి తోడ్పడతారని విశ్వాసం. ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం ద్వారా వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు