ప్రతిరోజు లక్ష్మీ గణపతిని పూజించండి

ఆర్థిక సమస్యలు, ఈతి బాధలు తొలగి పోవాలంటే ప్రతిరోజు లక్ష్మీ గణపతిని పూజించాలని పండితులు అంటున్నారు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి "ఓం గ్లౌం" అనే మంత్రాన్ని 40 రోజులలో 1 లక్షా 20వేల సార్లు స్తుతించి పూర్తి చేయాలి.

ప్రతిరోజు అరటిపండో, బెల్లమో ఏదైనా తీపి పదార్థాన్ని గణపతికి నైవేద్యం పెట్టి నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.

అదేవిధంగా.. ఆదివారం, శుక్రవారం, మంగళవారం పూట గణపతి ఆలయాల్లో నేతితో దీపం వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ఇంకా తామర ఒత్తులతో నేతి దీపమెలిగించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. తామర ఒత్తులతో గణపతికి దీపమెలిగించే వారికి వ్యాపారాభివృద్ధి, సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం.

వెబ్దునియా పై చదవండి