బంగారు శివలింగం, ఇత్తడి శివలింగం, రాగి శివలింగం, స్పటిక శివలింగం, మట్టి శివలింగం ఇలా వివిధ రకాల శివలింగాలున్నాయి. ఒక్కో శివలింగానికి అభిషేకం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ద్రాక్ష రసం, నేరేడు పండ్ల రసం, చెరకు రసం, మామిడి పండ్ల రసాలతో పరమశివునికి అభిషేకాలు చేయడం వలన ధనధాన్యాలు చేకూరుతాయి.