వేపపువ్వును భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపపువ్వులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపపువ్వులోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తాతాయి. వేపపువ్వులో యాంటీ బాక్టీరియల్, యాంటి సెప్టిక్ గుణాలుంటాయి. వేపపువ్వు చర్మానికి, జుట్టు, ఆరోగ్యానికి కూడా అద్భుత ఫలితాలను అందిస్తుంది. మరి ఇటువంటి వేపపువ్వుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.
తయారీ విధానం:
ముందుగా చింతపండును నీటిలో ఓ అరగంట పాటు నానబెట్టుకుని దానిని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కల్ని ఆ చింతపండు గుజ్జులో వేసి కలుపుకోవాలి. ఆ తరువాత బెల్లంపొడి వేసి బాగా కలుపుకుని అందులో ఉప్పు, కారం, వేపపువ్వు వేసి కలుపుకుంటే వేపపువ్వు పచ్చడి రెడీ.