లక్ష్మీదేవి ఆరాధన ఫలితం...

శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:06 IST)
ప్రతి ఒక్కరూ తమ ఇల్లు సిరిసంపదలతో ఉండాలని కోరుకుంటారు. సంపద వలన అన్ని అవసరాలు తీరకపోయిన కష్ట సమస్యలను తరిమేసే శక్తి దానికి ఉంది. అందువలనే ప్రతి ఒక్కరూ ధనం విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తుంటారు. అయితే ధనమనేది కొంతమంది దగ్గర నిలకడగా ఉంటుంది. మరికొంతమంది దగ్గర అంతగా ఉండదు. ఈ కారణంగానే లక్ష్మీదేవి చంచలమైనదని చెప్తుంటారు.
  
 
ఎవరైతే వినయంతో ధర్మబద్ధులై తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారో అలాంటివారి ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటారని చెబుతారు. లక్ష్మీదేవి రాకతో ఎవరైతే అహంభావంతో వ్యవహరిస్తారో అలాంటివారిని వదిలిపెట్టి వెళ్లిపోవడానికి ఆమె ఎంతమాత్రం ఆలోచించదని అంటుంటారు. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకునే వారు ధర్మబద్ధులై పవిత్రమైన జీవితాన్ని గడపవలసి ఉంటుంది.    

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు