పార్వతీ పరమేశ్వరులకు నేను కూడా పుత్రుడినేనని, నా తల్లిదండ్రుల దర్శననానికి అనుమతి అవసరం లేదని పరశురాముడు లోపలికి వెళ్లబోతాడు. వినాయకుడు ఎంతగా చెప్పిన వినిపించుకోకపోవడంతో తన తొండంతో పరశురాముని గట్టిగా చుట్టేసి గిరగిరా తిప్పుతూ సప్త సముద్రాల్లో ముంచేసి మళ్లీ కైలాసానికి తీసుకొస్తాడు.
ఆ తరువాత పరశురాముడు ఆగ్రహంతో తన చేతిలోని గొడ్డలిని గణపతిపై విసురుతాడు. దాంతో గణపతికి దంతం విరిగిపోతుంది. అంతలో పార్వతీపరమేశ్వరులు బయటకి వస్తారు. అదే సమయంలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తాడు. గణపతి గాయం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతిని బాధపడొద్దనీ చెప్పి, ఇక గణపతి ఏకదంతుడు అనే పేరుతో పిలువబడుతాడని సెలవిస్తాడు.