భావము: సుందరమైన మోము కలిగిన, చంద్రునికి సహోదరివైన ఆదిలక్ష్మీదేవి నిను మేము ముందుగా పూజిస్తాము. మునిగణాలు కొలిచే, మోక్షాన్ని ప్రసాదించే మంజులాదేవీ మాపై కృప చూపించుము. పంకజములో నివసించే ఓ చల్లని తల్లీ మాకు విజయములు చేకూర్చుము. దేవగణాదులచే నిత్యం పూజించబడే శాంతిస్వరూపిణి నీకు జయము జయము.