నాగులచవితి రోజున పై మంత్రమును పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతినెలా వచ్చే చవితి రోజున... ఓ నాగేంద్రా.. మానవ వంశంలోని మేము నిన్ను ఆరాధిస్తున్నాం. పొరపాటున తోకతొక్కితే తొలగిపో.., నడుం తొక్కితే నా వాడనుకో! పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ చేసే వారికి సర్పదోషాలుండవని పురాణాలు చెబుతున్నాయి.
నాగుల చవితి, మాసాల్లో వచ్చే చవితి రోజున పై మంత్రమును పఠించి సర్పారాధనకు తామరపువ్వులు, కర్పూరంపువ్వులు, లడ్డూలను సమర్పిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.