ఈశ్వరాధనకు కార్తీకమాసం చాలాముఖ్యమైందని ఆర్యులు అంటున్నారు. దేశంలోని పలు శివాలయాల్లో కార్తీకమాసం ప్రారంభం నుంచే రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలను విశేషంగా జరుపుతుంటారు.
అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నమై కొంగుబంగారంలా సకల సంపదలను, సుఖజీవితాన్ని ప్రసాదిస్తాడు.